మంత్రి కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో దీక్షా దివస్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆరోపించింది.

 Congress Complaint To Ec Against Minister Ktr-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.తక్షణమే దీక్షా దివస్ ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివస్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా తెలంగాణ భవన్ కు ఎన్నికల కమిషన్ స్క్వాడ్ వెళ్లింది.

దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరగా.ఇది కొత్త కార్యక్రమం కాదని, ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

కాగా తెలంగాణభవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube