కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ జంకుడు !

కర్నాటక ఎన్నికలకు(Karnataka elections ) ఎంతో సమయం లేదు.వచ్చే నెల 10న ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ నేపథ్యం ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ అస్త్రశాస్త్రాలతో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.ఇరు పార్టీల మద్య ఈసారి టాఫ్ ఫైట్ నెలకొనే అవకాశం ఉన్నందున ఏ పార్టీ పై చేయి సాధిస్తుందో అన్న ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది.అటు కాంగ్రెస్( Congress ) కూడ ఈసారి గెలుపుపై కాన్ఫిడెంట్ గా ఉంది.

దీంతో రేస్ లో నిలిచే ఇరు పార్టీల అభ్యర్థుల జాబితా ఎలా ఉండబోతుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.

Advertisement

ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటనలలో కాంగ్రెస్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది.ఇప్పటికే 166 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ముందే ప్రకటించింది.ప్రచారంలో దూసుకుపోతుంది.

ఇక ఆత్మీయ సమ్మేళనలు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు వంటిని నిర్వహిస్తూ నేతల్లో కూడా ఫుల్ జోష్ నింపుతోంది హస్తం పార్టీ.ఇక బీజేపీ( BJP ) విషయానికొస్తే హస్తం పార్టీతో పోలిస్తే కాషాయ పార్టీ అభ్యర్థుల విషయంలో ఇంక తర్జనభర్జన పడుతూనే ఉంది.

ఇప్పటివరకు కూడా అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను ఇంకా బయట పట్టలేదంటే ఆ పార్టీ ఎంత గందరగోళానికి గురి అవుతోందో అర్థం చేసుకోవచ్చు.

కాగా అభ్యర్థుల జాబితాను ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి వారితో కర్నాటక సి‌ఎం బసవరాజ్ బొమ్మై( Basavaraj Bommai ), మాజీ సి‌ఎం యాడ్యూరప్ప ఆదివారం డిల్లీలో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక కు సంబంధించి మోడీ పలు సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.మరి ప్రధాని సూచనల మేరకు అభ్యర్థుల జాబితా ఏలా ఉండబోతుందనేది ఆసక్తికరం.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

ఇదిలా ఉంచితే ఈసారి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై కన్నడ నాట తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.దాంతో వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువే అనే వార్తలు కూడా ఊపందుకున్నాయి.

Advertisement

ప్రస్తుతం బీజేపీ నేతలను కూడా ఇదే భయం వెంటాడుతునట్లే కనిపిస్తోంది.మరి ఎన్నికల్లో కన్నడ ప్రజల తీర్పు ఏలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు