ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటివని భారీ ప్రచారం జరుగుతున్న దరిమిలా భాజపా అధిష్టానం( BJP ) ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.నవంబర్ ఏడో తారీఖున చతిస్గడ్ లోని( Chattisgarh ) 20 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరగనుంది.దాంతో కాంగ్రెస్ భాజపాలు హోరాహోరి పోరుకు తెర లేపాయి .2003 నుంచి 2018 వరకు దాదాపు 15 సంవత్సరాలు చత్తీస్ఘడ్ ను బాజాపా తిరుగులేని విధంగా పరిపాలించింది.ఆ పార్టీ కీలక నాయకుడు రమణ్ సింగ్( Raman Singh ) మూడు పర్యాయాలు భాజపా అధికారం లోకి రావడానికి ప్రదాన కారణం అని చెప్పాలి.

అయితే పౌరసరఫరాల కుంభకోణం, చిట్ ఫండ్ స్కాములతో పేరు తో భారీ అవినీతి ఆరోపణలు భాజపా ప్రభుత్వం పై రావడం తో 2018లో జరిగిన ఎన్నికలలో చతిస్ఘడ్ ప్రజలు కాంగ్రెస్ కు( Congress ) అవకాశం ఇచ్చారు.2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న చత్తీస్గడ్లు లో 68 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చింది.కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్( CM Bhupesh Baghel ) అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అక్కడ ఉన్న మెజారిటీ గా ఉన్న గిరిజనులను, బిసి లను ఆకట్టుకోవడంతో మరోసారి కాంగ్రెస్ గెలుపు తధ్యమే నని అంచనాలు ఉన్నాయి.

అయితే కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు పెద్దగా లేకపోయినప్పటికీ వర్గ పోరు ఆ పార్టీని ఎక్కువగా ఆందోళన పరుస్తుంది .సరిగ్గా ఈ పాయింట్ ను ఉపయోగించుకోవాలనుకుంటున్న బాజాపా మరోసారి అక్కడ చక్రం తిప్పడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది, ప్రదాని మోడి( PM Modi ) సహ 40 మంది కీలక మంత్రులను నేతలను స్టార్ కాంపైనర్ ల గా ఎన్నికల ప్రచార బరిలో దింపుతుంది .అయితే తన సంక్షేమ పరిపాలన ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి భూపేష్ ఇమేజ్ పైన కాంగ్రెస్ ఆధారపడుతుంది, అయితే అయితే భాజపా పరిపాలనతో పోలిస్తే కాంగ్రెస్ పరిపాలన పైనే అక్కడే చతిస్గడ్ ప్రజలు ఎక్కువ నమ్మకం వ్యక్తం చేస్తున్నట్లుగా సర్వేలు రిపోర్టుల ద్వారా అర్థమవుతుంది.దాంతో చతిస్గడ్ ని హస్తం పార్టీ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువ అన్నది రాజకీయ విశ్లేషకులు భావన.