టీఆర్ఎస్ పార్టీలో గంద‌ర‌గోళం.. అర్ధ‌రాత్రి ఎంపీపీ అరెస్ట్ కు య‌త్నం

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ తాడూరి వెంక‌ట్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు య‌త్నించ‌డం అర్ధరాత్రి క‌ల‌క‌లం సృష్టించింది.కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డంతో పోలీసులు అరెస్ట్ కు సిద్ధ‌మ‌య్యారు.

 Confusion In Trs Party Attempt To Arrest Mp At Midnight , Arrest, Hyd, Midnight, Mpp Venkat Reddy , Trs, Vanastalipuram-TeluguStop.com

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ వ‌న‌స్థ‌లిపురంలోని చౌటుప్ప‌ల్ ఎంపీపీ నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.ఆయ‌న ఇంటిని ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు చుట్టుముట్టి, అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ వ్య‌వహారంపై స్పందించిన వెంక‌ట్ రెడ్డి.కావాల‌నే కుట్ర పూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు.అర్ధ‌రాత్రి స‌మ‌యంలో డోర్లు కొట్టి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శించారు.ఇలాంటి తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డే ప్రస‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube