ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి యూత్ ఐకాన్ గా మారిన దివంగత నటుడు ఉదయ్ కిరణ్ దర్శకుడు తేజ మధ్య వివాదం గురించి ఎప్పుడు మాట్లాడినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజ.
చిత్రం అనే సినిమా ద్వారా హీరోగా అవకాశం ఇచ్చాడు.ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లు లేక పోవడంతో ఇక తేజా ని తన గురువుగా భావించాడు ఉదయ్ కిరణ్.
కానీ ఇక చిత్రం సినిమా తర్వాత మాత్రం ఉదయ్ కిరణ్ డైరెక్టర్ తేజ మధ్య వివాదాలు వచ్చాయి అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది అన్నదానికి ఆజ్యం పోసే విధంగా ఎన్నో సంఘటనలు జరిగాయ్.
డైరెక్టర్ తేజ నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ జయం సినిమా తెరకెక్కించాడు.ఈ సినిమా ఊహించిన దాని కంటే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.1.62 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా 32 కోట్ల వసూలు సాధించింది.అయితే ఇదే సినిమాకు పోటీగా ఉదయ్ కిరణ్ తన శ్రీరామ్ సినిమా విడుదల చేశాడు.ఇక ఈ రెండు సినిమాల మధ్య కేవలం వారం రోజులు మాత్రమే గ్యాప్ వుండటం గమనార్హం.

అంతేకాకుండా ఇక ఉదయ్ కిరణ్ శ్రీరామ్ సినిమాలో ఒక కమెడియన్ పాత్రకు తేజ అనే పేరు ఉంటుంది.ఆ పాత్ర ఎప్పుడూ ఇతరులతో తిట్లు తింటూ ఉంటుంది.ఆ పాత్రకు తేజ మీద కోపంతోనే ఉదయ్ కిరణ్ ఆ పేరు పెట్టారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఇలా కేవలం వారం రోజుల గ్యాప్లో విడుదలైన ఈ రెండు సినిమాల్లో డైరెక్టర్ తేజ దే పైచేయి అయింది.
ఎందుకంటే తేజ దర్శకత్వంలో వచ్చిన జయం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.ఉదయ్ కిరణ్ శ్రీ రామ్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది అని చెప్పాలి.