సినిమా టికెట్ రేట్లను నిర్దారిస్తూ జీవో నెంబర్ 13ను గత నెలలో జారీ చేశాం-పేర్ని నాని , సినిమాటోగ్రఫీ మంత్రి

సినిమా టికెట్ రేట్లను నిర్దారిస్తూ జీవో నెంబర్ 13ను గత నెలలో జారీ చేశాం.సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు రెమ్యునరేషన్ కాకుండా రూ.100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు 10 రోజుల పాటు ప్రత్యేక టికెట్ నిర్దారించుకునేలా ఆదేశాలు ఇచ్చాం.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా దరఖాస్తు వచ్చింది.రూ.336 కోట్లతో సినిమా నిర్మించినట్టు వెల్లడించారు.దానికి అనుగుణంగా పరిశీలించి జీఎస్టీ చెల్లించిన తర్వాత ప్రత్యేక టిక్కెట్ రేట్లకు అనుమతి ఇస్తాం.జీవో జారీ కంటే ముందే ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మించారు.

 Jivo No. 13 Was Issued Last Month Confirming Movie Ticket Rates , Movie Ticket-TeluguStop.com

ఈ కారణంగా 20 శాతం షూటింగ్ రాష్ట్రంలో చేసి ఉండాలన్న నిబంధన ఈ సినిమాకు వర్తించదు.కొత్తగా నిర్మించే సినిమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.అన్ని సినిమాలు ఐదు షోలు రన్ చేసుకోవచ్చు.ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యన ఐదు షోలు వేసుకోవచ్చు.

అయితే చిన్న సినిమాలు విడుదలైతే.కంపల్సరీగా ఆ సినిమాకు ఓ షో వేసుకునే వీలు కల్పించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube