వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అర్ధరాత్రి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రాత్రి సమయంలో కరెంట్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది.
అదే సమయంలో జనరేటర్ కూడా మొరాయించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఐసీయూలో ఉన్న ఆక్సిజన్ పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు గంట సమయం తరువాత కరెంట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఆస్పత్రి సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించేందుకు ఫోన్స్ చేసినప్పటికీ అర్థరాత్రి సమయం కావడంతో ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది.







