ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం..నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ

హైదరాబాద్ లోని జలసౌధ( Jalasoudha )లో నిర్వహించిన కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది.

ఈ క్రమంలో ప్రాజెక్టుల ఆపరేషన్ ను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ ( AP, Telangana )అంగీకారం తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.కాగా వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని తెలుస్తోంది.

బోర్డు పరిధిలో ఉన్న 15 ఓటీస్ లలో తెలంగాణ 9, ఏపీవి ఆరని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి( Enc Narayana Reddy ) తెలిపారు.

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాఫ్ కేటాయింపు ఉండనుండగా.

ఏపీకి

లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీలు, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీ నీటి విడుదలకు అంగీకారం వచ్చిందన్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఏప్రిల్ లో ఐదు టీఎంసీలు ఏపీకి ముందు నుంచే ఉన్నాయని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు