Ctrl + C, Ctrl + X, Ctrl + V సృష్టికర్త లారీ టెస్లర్ కన్నుమూత

సాధారణంగా కంప్యూటర్ తెలిసిన వారికి కట్, కాపీ, పేస్ట్‌ల గురించి చెప్పక్కర్లేదు.

ఈ మూడు షార్ట్ కట్ కీ ల వల్ల సాంకేతిక ప్రపంచంలో ఏ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ ఆవిష్కరణలు చేసి మానవాళికి మేలు చేసిన లారీ టెస్లర్ సోమవారం కన్నుమూశారు.ఆయన వయసు 74 సంవత్సరాలు.1945లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన లారీ టెస్లర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పట్టా పొందారు.1970లలో జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్న సమయంలో కట్, కాపీ, పేస్ట్‌ను అభివృద్ధి చేశారు.గతంలో ముద్రించిన పత్రాలను కత్తిరించి మనం ఎలా అయితే కావాల్సిన చోట అతికించుకుంటామో ఆ విధానం స్ఫూర్తితో నే ఆయన ఈ మూడు కీ లను కనుగొన్నారు.

ఆపిల్ సంస్థ లిసా కంప్యూటర్లలో తొలిసారిగా దీనిని ఉపయోగించడంతో ఈ విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది.ఆపిల్ సంస్థతో కలిసి 20 ఏళ్లు పనిచేసిన టెస్లర్ ఆ సమయంలోనే లిసా, మకిన్‌తోష్, న్యూటన్‌కు సంబంధించి ఐ ఫోన్‌లో వాడే యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్‌ను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేశారు.

కట్, కాపీ, పేస్ట్‌లతో పాటు ఇప్పుడు విస్తృతంగా ఉపయోగిస్తున్న బ్రౌజర్ అనే పదాన్ని సైతం 40 ఏళ్ల కిందటే ఆయన సూచించారు.అమెజాన్‌లో చేరడానికి ముందు ఆయన స్టేజ్‌కాస్ట్ సాఫ్ట్‌వేర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు.

Advertisement

తన జీవితకాలంలో అమెజాన్, ఆపిల్, యాహూ, పీఏఆర్‌సీ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన టెస్లర్.తన మేధా శక్తితో సాంకేతిక ప్రపంచానికి ఎనలేని సేవలు చేశారు.ఆపిల్‌నెట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, యాహూలో యూజర్స్ ఎక్సిపీరియన్స్ అండ్ రీసెర్చ్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు.

టెక్నాలజీలో దిగ్గజాలుగా పేరొందిన బిల్‌గేట్స్, స్టీవ్ జాబ్స్‌‌ల స్థాయిలో గుర్తింపు రావాలసిన టెస్లర్‌కు గుర్తింపు దక్కకపోవడం నిజంగా దురదృష్టకరమే.లారీ టెస్లర్ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు