రోజురోజుకీ కరోనా ఉధృతి పెరుగుతుండడంతో ప్రభుత్వాలు ప్రజలు మాస్క్ లు లేకుండా కనిపిస్తే ఫైన్స్ వేసే సిస్టమ్ ను తీసుకొచ్చాయి.ఇక తాజాగా సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వంగళ భాస్కర్ కోడి గుడ్ల కోసం ఇంటిపక్కన ఉన్న కిరాణా షాప్ కు మాస్క్ లేకుండా వెళ్ళాడు.
మాస్క్ లేకుండా ఉన్న తనను చూసిన కోనరావుపేట ఎస్సై తన పట్ల అనుచితంగా వ్యవహరించినట్లు బాధితుడు మీడియాతో తెలిపారు.
బాధితుడు అందించిన సమాచారం మేర ఆగస్ట్ 11వ తేదీన రాత్రి 9.30 వంగళ భాస్కర్ ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ కు కోడిగుడ్ల కోసం వెళ్ళాడు అదే సమయంలో అటుగా పెట్రోలింగ్‌కు వచ్చిన కోనరావుపేట ఎస్సై మాస్క్ ధరించలేదని కేసు నమోదు చేస్తానని బెదిరించి తన సెల్‌ఫోన్ తీసుకెళ్లాడట.ఆ ఫోన్ ను తెచ్చుకోవడం కోసం మరుసటిరోజు భాస్కర్ ఠాణాకు వెళ్ళాడు.
దానితో కోపోద్రిక్తుడైన ఎస్సై తనని దుర్భాషలాడి ఆతరువాత నువ్వు నీ భార్యను కొడతావట కాదా తనని నీతో పాటు తీసుకురా మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తానని అన్నారు.
మా భార్యాభర్తలు సమస్యలను మేము పరిష్కరించుకోగలమని కోరిన వినకుండా నీ భార్యను తీసుకొస్తానే ఫోన్ ఇస్తానని అన్నారు.
దానికి నేను ఒప్పుకోకపోవడంతో తనని రెండు గంటలపాటు ఠాణా ఆవరణలో నిలుచోబెట్టారని ఇక మీద తనను ఠాణా చుట్టూ తిప్పుతానని హెచ్చరించి ఫోన్ ఇచ్చారని బాధితుడు మీడియాతో వాపోయాడు.