త్రివిక్రమ్ స్టోరీల్లో ఆ సీన్ ఖచ్చితంగా ఉండాల్సిందే.. అది లేకపోతే సినిమా నడవదు?

త్రివిక్రమ్ స్టోరీల్లో ఆ సీన్ ఖచ్చితంగా ఉండాల్సిందే.అది లేకపోతే సినిమా నడవదు?టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రైటర్ గా తెలుగులో అతి తక్కువ సమయం లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు.తన కంటూ ఒక బ్రాండ్ నేమ్ సెట్ చేసుకున్నాడు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్ గా త్రివిక్రమ్ చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర స్టార్ డైరెక్టర్ల లో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

 Common Points In Trivikram Movies, Trivikram,khaleja, Jalsa, Son Of Satyamurthy,-TeluguStop.com

ఇక త్రివిక్రమ్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటాడు.ఇక ఈయన సినిమా అంటే చాలు ప్రేక్షకులు పడి చస్తారు.ఎందుకంటే ఈయన సినిమాలు అంతగా ఆకట్టుకుంటాయి కాబట్టి.పైగా మంచి మంచి స్టోరీ తో అందులో మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.

ఇక ఈయన సినిమాలు అన్నీ ఒకే కాన్సెప్ట్ లో ఉన్నట్లు అనిపించినా కూడా ఎక్కడ మ్యాచ్ కాకుండా చివరి వరకు మంచి ఇంట్రెస్ట్ తో ఫినిషింగ్ టచ్ ఇస్తాడు త్రివిక్రమ్.నిజానికి త్రివిక్రమ్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారు.

ఆయన సినిమా వచ్చింది అంటే చాలు చివరి వరకు ఆ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు.ఇక ఈయన చాలా వరకు స్టార్ హీరోలతోనే సినిమాలు చేయటానికి ముందుకు వస్తాడు.

ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమాలో ఏదో ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది.ఆ సెంటిమెంట్ ను ప్రతి ఒక్క సినిమాలలో వాడుతాడు త్రివిక్రమ్.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

ఈయన సినిమాలో కథ మలుపు తిరగాలి అంటే.మొదట అందులో ఎవరో ఒకరు కీలక వ్యక్తులు చనిపోవాలి.

దాంతోనే సినిమా అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది.అలా ఇప్పటికి చాలా సినిమాలలో అలాంటి చనిపోయే సీన్స్ తర్వాతే టర్నింగ్ పాయింట్ ఉండగా.ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జులాయి:

ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమా జులాయి.ఇందులో అల్లు అర్జున్ నటించగా.ఇందులో సోనుసూద్ తమ్ముడు చనిపోవడంతో కథ అక్కడి నుండి మలుపు తిరుగుతుంది.

సన్నాఫ్ సత్యమూర్తి:

ఇక సన్నాఫ్ సత్యమూర్తి లో కూడా అల్లు అర్జున్ హీరోగా నటించాడు.ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ తండ్రి చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది.

అత్తారింటికి దారేది:

పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అమ్మ గన్ షూట్ ద్వారా చనిపోతుంది.దీంతో అప్పటినుంచి కథ మొదలవుతుంది.

అ ఆ:

నితిన్ నటించిన ఈ సినిమాలో నితిన్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది.

అరవింద సమేత:

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత లో కూడా ఎన్టీఆర్ తండ్రిగా నటించిన నాగబాబును మరో మనుషులు దాడి చేసి చంపేస్తారు.దీంతో ఇక్కడి నుండి కథ ప్రారంభమవుతుంది.

అజ్ఞాతవాసి:

పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి చనిపోవడంతో అక్కడి నుండి కథ మలుపు తిరుగుతుంది.

అతడు:

మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో పార్ధు చనిపోవడంతో ఆయన స్థానంలో మహేష్ బాబు పార్ధు ఇంటికి వెళ్లడంతో అక్కడినుంచి కథ మొదలవుతుంది.

అలా వైకుంఠపురంలో:

ఇక అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాల్లో కూడా ఒక ఆవిడ చనిపోవడం వల్ల ఇక్కడి నుండి కథ ప్రారంభమవుతుంది.

ఖలేజా:

మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో ఓ డాక్టర్ కారు మీద పడిపోవటంతో అప్పటినుంచి కథ ప్రారంభమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube