మహేష్ తో పనిచేసిన ఈ ముగ్గురు డైరెక్టర్లలో.. ఈ కామన్ క్వాలిటీ గమనించారా?

ఒకప్పుడైతే హీరో నటన ఎలా ఉంది అన్నది మాత్రమే చూసే వారు ప్రేక్షకులు.

కానీ నేటి రోజుల్లో మాత్రం హీరో నటన గురించి మాత్రమే కాదు సిక్స్ ప్యాక్ ఉందా లేదా.

ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉన్నాడా లేదా అన్న విషయాలను కూడా గమనిస్తున్నారు.అయితే పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఇక జిమ్ లో తెగ కష్టపడి పోతున్నారూ అన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు హీరోలు మాత్రమే ఫిట్నెస్ కాపాడుకోవడం గురించి విన్నాము.కానీ ఇటీవల కాలంలో దర్శకులు సైతం ఫిట్నెస్ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంటున్నారూ.

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో ఎంతో కచ్చితత్వంతో ఉంటారు.ఇక ఇటీవలే సర్కారు వారి పాట సినిమాలు మరింత ఫిట్ గా మారి పాతికేళ్ళ కుర్రాడిలా కనిపించాడు.

Advertisement

అయితే మహేష్బాబు మాత్రమే కాదు ఆయనతో పనిచేసిన దర్శకులు కూడా ప్రస్తుతం ఫిట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న పరిస్థితి కనిపించింది.ఇలా మహేష్ బాబు తో పని చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా మహేష్ బాటలోనే ఫిట్ గా మారిపోయారు అని చెప్పాలి.

ప్రస్తుతం సౌత్ లోనే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు థమన్.

మహేష్ తో దూకుడు సినిమాకి పని చేశాడు.ఇక ఆ సమయంలో ఎంత భారీ కాయంతో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక మొన్నటికి మొన్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు పని చేశాడు థమన్.

ఇక దూకుడు నుంచి సర్కారు వారి పాట వరకు థమన్ లో ఎంతో చేంజ్ వచ్చింది.భారీ కాయంతో ఉన్న థమన్ బరువు తగ్గి సన్నగా మారిపోయాడు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

న్యూ లుక్ లో అందరిని ఆకర్షిస్తున్నాడు.అచ్చంగా ఇలాగే మహేష్ బాబు మహర్షి సినిమా కు ముందు వంశీ పైడిపల్లి కూడా కాస్త లావుగా ఉండేవాడు.మహేష్ తో మహర్షి సినిమా కంప్లీట్ అయ్యేలోపు సన్నబడి పోయారు ఆ దర్శకుడు.

Advertisement

ఇక మొన్నటికి మొన్న సర్కారు వారు పాట డైరెక్టర్ పరశురామ్ విషయంలోనూ ఇదే జరిగింది.గీతగోవిందం సమయంలో ఎంతో లావుగా కనిపించిన పరశురాం ఇటీవలే మహేష్ బాబుతో సర్కారు వారి పాట పూర్తయ్యేలోపు మహేష్ లా సన్నబడి పోయాడు.

ఇక ఇవన్నీ చూసిన తర్వాత మహేష్ బాబుతో సినిమా అంటే దర్శకులు అందరూ సన్నబడి పోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

తాజా వార్తలు