బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వచ్చే బతుకమ్మ తీహార్ జైలులోనే చేస్తుందని తెలిపారు.
కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ జైలు పాలు కావాల్సిందేనని జోస్యం చెప్పారు.తొమ్మిది సంవత్సరాలుగా ప్రతిపక్షాలను అణచివేసి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు.
కేంద్ర నిఘా వ్యవస్థ కల్వకుంట్ల కుటుంబం అవినీతి మొత్తం బయటపెడుతుందని తెలిపారు.