ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన కమెడియన్లు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు ఇక్కడ అవకాశాలు లేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఉంటాయో ఎవ్వరికీ తెలీదు కాబట్టి ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ ని పోషించడానికి ప్రతి ఒక్క హీరో నటుడు కూడ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండాల్సిందే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలని నమ్ముకొని ఎక్కువ రోజులు ఉండలేక ఇండస్ట్రీ లో వచ్చే చిన్న చిన్న అవకాశాల వల్ల ఉపయోగం లేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు ఎవరంటే.

సుమంత్ శెట్టి ( Sumanth Shetty ) ఈయన 2003 లో వచ్చిన జయం సినిమా తో కమెడియన్ గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించడం తో కెరియర్ మొదట్లో ఆయన కి కమెడియన్ గా మంచి పేరు అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆయన కి అవకాశాలు తగ్గిపోయాయి.

ఇక దానికి తగ్గట్టు గానే జబర్దస్త్ నుంచి కొత్త కమెడియన్లు రావడం వల్ల కూడా ఈయన కి అవకాశాలు తగ్గిపోయాయి.

గీతా సింగ్( Geeta Singh ) ఈమె అల్లరి నరేష్( Allari Naresh ) హీరో గా వచ్చిన కితకితలు సినిమాతో నటీ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక దానికి తగ్గట్టుగానే ఈమెకి ఇండస్ట్రీ లో చాలా.అవకాశాలు వచ్చాయి కానీ చెప్పుకోదగ్గ ఒక పాత్ర కూడా మళ్ళీ ఆమెకి పడకపోవడం తో ఆమె కి ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గిపోయాయి.దాంతో ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు అలా ఇండస్ట్రీ లో ఉన్న నటి నటులను కాపాడుకుంటూ రావడం ఇండస్ట్రీ బాధ్యత.

Advertisement
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

తాజా వార్తలు