నా ఫేవరెట్ కమెడియన్ అతనే... కమెడియన్ సుధాకర్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతల సంపాదించుకున్నటువంటి సీనియర్ కమెడియన్ సుధాకర్ ( Comedian Sudhakar ) గురించి పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ గా నటించినటువంటి ఈయన అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Comedian Sudhakar Favorite Comedian Ms Narayana,ms Narayana,comedian Sudhakar,co-TeluguStop.com

అయితే ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడటంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించకపోవడంతో ఏకంగా ఈయన చనిపోయారు అంటూ వార్తలు కూడా సృష్టించారు.


Telugu Sudhakar, Comedians, Fathers Day, Yana, Tollywood, Zee Telugu-Movie

ఈ విధంగా సుధాకర్ చనిపోయారంటూ పలుమార్లు వార్తలు వైరల్ అయ్యాయి.దీంతో ఈ వార్తలపై స్పందించిన సుధాకర్ తాను చనిపోలేదని క్షేమంగానే ఉన్నాను అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సుధాకర్ తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు.ఫాదర్స్ డే ( Fathers Day ) సందర్భంగా ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు.


Telugu Sudhakar, Comedians, Fathers Day, Yana, Tollywood, Zee Telugu-Movie

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.ముందుగా తన ఆరోగ్యం గురించి తన గురించి వస్తున్నటువంటి పుకార్ల పై స్పందించి తాను క్షేమంగా ఉన్నాను దయచేసి అలాంటి వార్తలు సృష్టించకండి అని చెప్పారు.అనంతరం తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా సంతోషం వేస్తుందని తెలిపారు.హీరో నుంచి కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను.

ఏ పాత్ర ఇచ్చిన చాలా సంతోషంగా చేశానని తెలియజేశారు.ఇండస్ట్రీలో తనతో పాటు ఎంతోమంది కమెడియన్స్ పనిచేశారు.

అయితే వారిలో తనకు ఎమ్మెస్ నారాయణ( MS Narayana ) అంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఫేవరెట్ కమెడియన్ గురించి సుధాకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే చాలా రోజుల తర్వాత ఈయనని బుల్లితెర కార్యక్రమంలో చూడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏమాత్రం గుర్తుపట్టలేని స్థితిలో సుధాకర్ ఉండడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube