బుల్లితెర యాంకర్లలో మంచి టైమింగ్ ఉన్న మేల్ యాంకర్లలో రవి ఒకరు.చాలా సంవత్సరాల క్రితం సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన యాంకర్ రవి నేటికీ వరుస టీవీ షోలతో బిజీగా ఉన్నారు.
టీవీ షోలతో పాటు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా అక్కడ రవి కనిపించి సందడి చేస్తూ ఉంటారు.మొదట్లో లాస్యతో కలిసి ఎక్కువ ప్రోగ్రామ్ లు చేసిన రవి ఆ తరువాత శ్రీముఖితో కలిసి ఎక్కువ ప్రోగ్రామ్ లు, షోలు చేశారు.
రవి శ్రీముఖి కలిసి చేసిన పటాస్ షో ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమై రవికి మిగతా షోలతో పోలిస్తే మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఈటీవీ ఛానెళ్లలోని ప్రోగ్రామ్ లలో ఎక్కువగా కనిపించిన రవి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే అదిరింది షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ షోలో రవి, భాను శ్రీ యాంకర్లుగా చేయగా ఆ షోకు పరవాలేదనే స్థాయిలో టీఆర్పీ రేటింగులు వచ్చాయి.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రవి, భాను శ్రీలను యాంకర్లుగా తొలగించి బొమ్మ అదిరింది పేరుతో ఆ షోను రన్ చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీముఖి ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే అదిరింది నుంచి యాంకర్ గా తొలగించిన తర్వాత రవి జబర్దస్త్ షోలో ఒక స్కిట్ చేయగా ఆ స్కిట్ లో పంతులు వేషం వేసి ” ఈ కుర్చీ మీదే పెళ్లి చేశాను.
ఈ కుర్చీ మీదే దినాలు చేశాను.మళ్లీ ఈ కుర్చీ అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరకే వచ్చింది” అని చెప్పగా ఆర్టిస్ట్ “అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఇక్కడకు రావాల్సిందే ” అని సెటైర్ వేశాడు.
తాజాగా రవికి అలాంటి అనుభవమే మరొకటి ఎదురైంది.స్టార్ మా ఛానల్ లో దసరా పండుగ సందర్భంగా ప్రసారం కాబోయే జాతరో జాతర ఈవెంట్ కు సంబంధించి విడుదలైన ప్రోమోలో చలాకీ చంటి “ఎక్కడ మొదలెట్టావో మళ్లీ అక్కడికే వచ్చావ్” అంటూ సెటైర్ వేశాడు.
స్టార్ మా మ్యూజిక్ ఛానల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన రవి మళ్లీ అక్కడికే వచ్చాడని చలాకీ చంటి కామెంట్ చేశాడు.చలాకీ చంటి వేసిన సెటైర్ తో యాంకర్ రవి అవాక్కయ్యాడు.