అనకాపల్లి జిల్లాలో( Anakapalli District ) ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు( Engineering College Bus ) బీభత్సం సృష్టించింది.ఈ మేరకు కసింకోట బయ్యవరం దగ్గర జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి బస్సు దూసుకెళ్లింది.
ఈ క్రమంలోనే మూడు బైకులు, కారుతో పాటు ఓ వ్యాన్ ను బస్సు ఢీకొట్టింది.దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడని సమాచారం.అలాగే పది మందికి పైగా గాయాలు కాగా.వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.