యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి( Yadadri Sri Lakshmi Narasimha Swamy )ని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులు కొండపైకి చేరుకుంది మొదలు చెప్పుల స్టాండ్,లగేజీ బ్యాగుల స్టాల్,సెల్ ఫోన్ కౌంటర్,కొబ్బరికాయల స్టాండ్, హోటల్స్,సాంప్రదాయ వస్త్రాల అమ్మకాల వరకు దేవస్థానం తరపున కాకుండా వర్తక వ్యాపార సంఘం కేంద్రం వారి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడుపుతూ భక్తుల జేబులు గుల్ల చేస్తున్నారని,చివరకు టాయిలెట్స్ వద్ద కూడా డబ్బులు వసూల్ చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.భక్తులు సమర్పించిన చీరలు,ఇతర వస్త్రాలను తిరిగి భక్తులకే వేలంపాట ద్వారా అమ్మేది కూడా ప్రైవేట్ వ్యక్తులే కావడం గమనార్హం.
రూ.కోట్లలో ఆదాయం సమకూరుతున్నా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలమైన ఆలయ అధికారులు,భక్తుల నుండి వివిధ రూపాల్లో పైసలు వసూల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుండగా కొంత కాలంగా ఆలయ ఈవో భాస్కరరావు( Eo Bhaskara Rao ) భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచే పనిలో భాగంగా కొన్ని మార్పులు చేపట్టడం భక్తులకు కాస్త ఊరట కలిగించినా పెద్దగా ఫలితం చూపలేకపోయాయని,దీనికి కారణం ఈవోను కొందరు అధికారులు డైవర్ట్ చేస్తూ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఎక్కడినుంచో వచ్చే భక్తులకు వసతి లేకుండా చేసి,విశాల భవనాల్లోని ఏసీ గదుల్లో అధికార యంత్రాంగం చేసే పనేంటని భక్తులు,స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా మరోవైపు టూరిజం సిబ్బంది యధేచ్చగా దర్శనాల దందాలు చేస్తూ జేబులు నింపుకుంటూ భక్తులను నిలువు దోపిడి చేస్తూ ధరల పట్టిక బోర్డు ఉన్నా అంతకు రెట్టింపు ధరలకు అమ్మకాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని వాపోతున్నారు.
కొండపై జరుగుతున్న అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పందించి ఇలాంటివి జరగకుండా,భక్తులపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ఉండేలా దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ మరియు ఉన్నతాధికారులతో సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని,ముప్పై ఏళ్ల నుంచి ఎలాంటి బదిలీలు లేకుండా ఉద్యోగాల్లో కొనసాగుతున్న దేవస్థాన సిబ్బందిని తక్షణమే బదిలీ చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.