శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ.

సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎంవారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం.

 Cm Ys Jagan Met With The Activists Of Tekkali Constituency Of Srikakulam Distric-TeluguStop.com

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో వివరించిన ముఖ్యమంత్రి.ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి:ఒకటి మిమ్మల్ని కలవడం ఒక కారణం అయితే, ఇక రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది: 18 నెలలంటే చాలా కాలం ఉందికదా? ఇవ్వాళ్టి నుంచే ఆలోచన చేయాలా? అనుకోవచ్చు:18 నెలల తర్వాత ఎన్నికలు ఉన్నా కూడా ఆ అడుగులు ఇవ్వాళ్టి నుంచి కరెక్టుగా పడితేనే.మనం క్లీన్‌స్వీప్‌ చేయగలుగుతాం: చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా టెక్కలికి సంబంధించి రివ్యూ చేస్తున్నాం:గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది మీరు అందరూ కూడా అందులో పాల్గొంటున్నారు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోంది

మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోంది ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగాం ఎవరెవరికి ఇచ్చామో.వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి పథకాన్ని అంత పారదర్శకంగా అమలు చేశాం అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్‌కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ద్వారా, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చాం అర్హత ఉన్నవారు మిస్‌కాకూడదనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం: గతానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి మేలు చేశాం ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175 కి 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేం?: తప్పకుండా గెలవగలుగుతాం ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే… ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే… ప్రతి గ్రామంలోనూ 87శాతం ఇళ్లకు మంచిచేశాం మంచి జరిగిన ఇళ్లలో ఉన్న వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175 కి 175 సాధించలేం

ఈరోజు గ్రామాలు మారుతున్నాయి.మన గ్రామంలోనే ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా ఆదుకునే ఆర్బీకేలు, విలేజ్‌క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పైలట్‌ ప్రాజెక్టు ఈ వారంలో ప్రారంభిస్తున్నాం, ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలవుతుంది.ప్రతి యాభై ఇళ్లకు వాలంటీరు కనిపిస్తున్నారు ఇలా గ్రామ రూపురేఖలన్నీ మార్చాం ఇలాంటి మార్పులు కనిపిస్తున్నప్పుడు ప్రతి కార్యకర్తా, నాయకుడూ కూడా 175 కి 175 స్థానాలు ఎందుకు సాధించలేమని మనం గుండెలమీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యం

జగన్‌ చేసే పని జగన్‌ చేయాలి అదే మాదిరిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలుగా, నాయకులుగా మనం చేసే పని మనం చేయాలి ప్రతి గడపకూ వెళ్లాలి.

మనంచేసిన మంచిని వారికి గుర్తుచేయాలి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కేవలం ఏ ఒక్కరి వల్లనో ఇది జరగదు నేను చేయాల్సింది నేను చేయాలి, మీరు చేయాల్సింది మీరు చేయాలి అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే సాధ్యం అవుతుంది టెక్కలి నియోజకవర్గంలో సర్పంచ ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు78 కి 74, ఎంపీపీలు 4 కి 4, జడ్పీటీసీలు 4 కి 4 గెలిచాంఒక్క టెక్కలిలోనే కాదు.కుప్పం నియోజకవర్గంలోకూడా ఇలాగే మంచి విజయాలు నమోదుచేశాం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది175 కి 175 ఎందుకు మనం తెచ్చుకోలేమన్న ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి మనకు ఎన్ని గొడవలు ఉన్నాసరే.

పక్కనపెడదాం బిగ్గర్‌పిక్చర్‌ గుర్తుకు తెచ్చుకుందాం రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే.వచ్చే 30 ఏళ్లూ మనం ఉంటాం ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నింటి వల్ల రానున్న కాలంలో మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి గొడవలున్నా అన్నీ పక్కనపెట్టేసి ముందడుగు వేద్దాం అందరం కలిసికట్టుగా ఒక్కటి కావాలినియోజకవర్గంలో భావనపాడు పోర్టు కూడా రాబోతుంది సుమారు రూ.4362 కోట్లు ఖర్చు చేస్తున్నాం డిసెంబరులో దీనికి శంకుస్థాపన చేయబోతున్నాంమహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు డిసెంబరులో పునరుద్ధరణ చేయబోతున్నాం సీఎంఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, కాళింగకార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube