ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.ఇటీవల నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల మధ్య వర్గ పోరు పెరిగిపోయింది.
తన వర్గాన్ని పక్కనపెట్టి చక్రపాణి రెడ్డి వర్గం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుపై సీఎం జగన్ కి మంత్రి రోజా ఫిర్యాదు చేయడం జరిగింది అంట.కావాలని నియోజకవర్గంలో తనని బలహీనపరిచే దిశగా పార్టీకి చెందిన నాయకులు వ్యవహరిస్తున్నారని.దీనివల్ల పార్టీ బలహీనపడే అవకాశం ఉందని జగన్ కి రోజా ఫిర్యాదు చేశారట.
ఈనెల 16వ తారీకు నగరి నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలను అసమతి నేతగా ఉన్న చక్రపాణి రెడ్డి వర్గం ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి రోజాకి ఆహ్వానం పంపించకుండా కార్యక్రమం కంప్లీట్ చేసేశారు.ఈ ఘటనపై అప్పట్లో పార్టీ కార్యకర్తలతో రోజా మాట్లాడుతూ ఈ రీతిలో రాజకీయం చేయాలంటే కష్టమే అన్న ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ క్రమంలో చక్రపాణి రెడ్డి వర్గం తనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలో వ్యవహరిస్తున్న తీరును అధినేత జగన్ దృష్టికి రోజా తీసుకెళ్లడం జరిగిందట.ఈ భేటీలో రోజాతో పాటు ఆమె భర్త సెల్వమని కూడా పాల్గొన్నట్లు సమాచారం.







