అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఇంత అరాచకం సృష్టించిన జగన్ కు పాలించే అర్హత ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు.92 మంది ఎమ్మెల్యేలను మారుస్తారట అన్న ఆయన మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎంను అని చెప్పారు.ఒక వ్యక్తి విధానాలతో మీ జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రజల కోసం యజ్ఞం చేశానన్నారు.ప్రజల కోసమే తన పోరాటమన్న చంద్రబాబు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.అలాగే రాజకీయాల్లో తన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని వెల్లడించారు.







