తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కౌంటర్ ఇవ్వనున్నారు.మధ్యాహ్నం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
కేబినెట్ సమావేశానికి ముందే ఈ మీడియా సమావేశం ఉండనుంది.కృష్ణా జలాల్లాలోని వాటాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Former CM KCR ) అగ్రిమెంట్ పై ఆధారాలను సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టనున్నారని తెలుస్తోంది.
అదే విధంగా ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కౌంటర్ ఇవ్వనున్నారని సమాచారం.కాగా ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.