తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) బుధవారం మహిళా సంఘాలతో భేటీ అయ్యారు.కోస్గిలో( Kosgi ) జరిగిన ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కుటుంబం ఆర్థికంగా బాగుపడాలి ఎదగాలి అంటే డబ్బులు ఆడబిడ్డ చేతిలో ఉండాలి.మగవారి చేతుల్లో డబ్బులు పెడితే సాయంత్రం కల్లా బెల్ట్ షాపుల్లో ఖర్చు పెడతారు.
ఆడబిడ్డ చేతుల్లో పెత్తనం డబ్బులు ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) యొక్క ఉద్దేశం.భవిష్యత్తులో సున్నా వడ్డీ విధానాన్ని అమలు చేస్తాం.
మిమ్మల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో సంఘాలను అభివృద్ధి చేయాలి.
సంఘాలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.
ఐకెపి, మహిళా సంఘాల ద్వారా పంటలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.ఇదే సమయంలో బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వటానికి కూడా కృషి చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ లో ఉన్న మంత్రుల ద్వారా కొడంగల్ లో ( Kodangal ) చదువుకి సంబంధించి అన్ని సంస్థలు ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కుటీర పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సంపూర్ణమైన సహకారం ఉంటుందని మహిళా సంఘాలకు( Women Associations ) సీఎం భరోసా ఇచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 5వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది.తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కొడంగల్ లో అడుగుపెట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డికి స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ పర్యటనలో నియోజకవర్గంలో మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది
.