తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పోలీస్ శాఖలో నియామకాలపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా హోంగార్డుల నియామకాలను చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.
వారి ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు.ఇదే సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ క్రమంలో వైద్యారోగ్య నియామకాలపై కూడా సీఎం సమీక్షించారు.నియామక ప్రక్రియలో లోటుపాట్లు.
అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.
మాజీ డిఎస్పి నళిని తెలంగాణ కోసం తన ఉద్యోగానికి అప్పట్లో రాజీనామా చేయడం జరిగింది.అదే నళినికి ఉద్యోగం ఇవ్వడానికి వచ్చిన ఇబ్బందేమిటి అంటూ సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే మళ్లీ ఆమెను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.
యూనిఫామ్ సర్వీస్ లో కాకపోయినా.ఆమెకు ఇష్టమైతే ఇతర శాఖలోనైనా.
ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు.ఇదే సమయంలో తన కాన్వాయ్ కోసం.
వాహనాదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.అంతేకాకుండా కాన్వాయ్ లో 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించమని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృతస్థాయిలో పర్యటనలు ఉంటాయి.కాబట్టి.
ట్రాఫిక్ కి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది.