వైసీపీ నాయకుల పై సీరియస్ కామెంట్లు చేసిన సీఎం రమేష్..!!

ప్రస్తుతం శీతాకాలం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా పార్లమెంట్ లో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కామెంట్లు చేశారు.

జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని సగం కాలం గడిచిపోయిందని కానీ రాష్ట్రంలో ఇంత వరకు.ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్పష్టం చేశారు.

కేవలం డ్రగ్స్ మరియు ఇసుక అక్రమాలు మాత్రం బాగా జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.అంత మాత్రమే కాక కడప స్టీల్ ప్లాంట్ కి.జగన్ పునాది రాయి వేసి రెండు సంవత్సరాలు గడిచింది.కానీ ఇప్పటివరకు పునాదిరాయి తప్ప అక్కడ ఎటువంటి పనులు జరగలేదని మండిపడ్డారు.

ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై.తప్పుడు కేసులు పెడుతున్నారని కావాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

ఇక ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నీ కూడా తప్పు పడుతూ ఆయనపై కూడా అట్రాసిటీ కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు.పోలీసులు వైసీపీ కార్యకర్తలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని కేవలం అరాచకం జరుగుతుందని.రాష్ట్రానికి పథకాలు కావాలని ఢిల్లీ కి .ఏ ఒక్క వైసీపీ నాయకులు రావడం లేదని అప్పు ఇవ్వాలని.అడగటానికి వస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు