పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉండుట వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.పసుపు సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేయటం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.
దాంతో ఇన్ ఫెక్షన్స్ రావు.అంతేకాక మనకు పసుపు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.
అయితే పసుపును అవసరానికి మించి వాడకూడదు.ఒకవేళ వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాం.
శరీరంలో పసుపు మోతాదు ఎక్కువ అయితే రక్తంలో ఎర్ర,తెలుపు రక్త కణాలకు ముప్పు ఏర్పడి నాశనం అయ్యే అవకాశం ఉంది.
పసుపు ఎక్కువ తీసుకోవటం వలన చర్మంపై అలర్జీలు,దద్దుర్లు వస్తాయి.
గర్భధారణ సమయంలో పసుపును చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
ఎందుకంటే కడుపులో పెరుగుతున్న పిండానికి ఇబ్బందులు కలగటమే కాకుండా రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.
కాలేయం పనితీరు మందగించి పచ్చ కామెర్లు రావటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
రక్త స్రావం సమస్యలతో బాధపడేవారు పసుపును వాడితే ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పసుపును మోతాదుకు మించి తీసుకుంటే కీళ్లనొప్పులు,వాపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పసుపును ఎక్కువగా తీసుకోవటం వలన పిత్తాశయం పనితీరు మందగించి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
పసుపును ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు రావటమే కాకుండా వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు,అల్సర్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.