పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు.దీనిలో భాగంగా పార్టీ కార్యాలయంతో పాటు, సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.266 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు.రామగుండం కార్పొరేషన్ కు రూ.కోటి మంజూరు చేస్తామని వెల్లడించారు.అదేవిధంగా మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తూ.ఆర్డర్లు ఇస్తామన్నారు.
అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.







