టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించారు.ఫామ్ హౌజ్ నుంచి నేరుగా ప్రగతిభవన్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో సమావేశం అయ్యారు.అసలు ఏం జరిగిందో అన్న విషయంపై కేసీఆర్ ఆరా తీశారు.
ఎమ్మెల్యేలను ఎవరు సంప్రదించారు.? ఎంత ఇస్తామన్నారు? ఈ విధంగా ఇంకా ఎవరికైనా ఫోన్ చేశారా అనే దానిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు.ఎమ్మెల్యేలు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరంలతో పాటు తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డిలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.ఇవాళ నలుగురు ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది.