టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభను న్యూఢిల్లీలో ప్లాన్ చేశారు. కేసీఆర్ ఈ సభకు సమయం దొరక్కపోవడంతో ఇనాళ్ళు ఆలస్యమవుతూ వచ్చింది.
ఈ విషయంలో పూర్తి ప్లాన్‌లో మార్పు కనిపిస్తోంది.ఇంత తక్కువ సమయంలో న్యూఢిల్లీలో సభ జరపడం అంతా సులువు కాదని తెలుస్తుంది.
అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుందని బీఆర్‌ఎస్ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.
ఈ నెల 18న బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ జరగనుందని, దీన్ని మరింత విస్తృతం చేసేందుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు.

కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కూడా కేసీఆర్ ఆహ్వానించారు.ఈ నలుగురు నేతలు బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
విపక్షాల ఐక్యతను, సత్తాను బీజేపీకి, మోదీకి ప్రదర్శించాలనేది కేసీఆర్ వ్యూహం. .

2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వాలని కేసీఆర్ భావించి బీఆర్‌ఎస్‌తో అడుగులు వేస్తున్నారు. అయితే అది అంత తేలికైన పోరు కాదు ఎందుకంటే ఉత్తర భారతదేశంలో బీజేపీ ఇంకా బలంగా ఉంది. తెలంగాణలో ఆ పార్టీ పోకస్ పెట్టింది.దీంతో బీఆర్‌ఎస్ ఆలర్ట్ అయిపోయింది.ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ తొలి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా పేరు మార్చి జాతీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.
ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ సమావేశానికి ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు ఖచ్చితంగా హజరయే అవకాశం ఉంది.