ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ నేత నారాయణ తీవ్రంగా విమర్శలు చేశారు.మోదీ ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదన్నారు.
మోదీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
పసుపు బోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసి తీర్థం పోసినట్లుందని నారాయణ ఎద్దేవా చేశారు.
ఏపీలో ఇసుక రీచ్ లు అదానీకి అప్పగించడంపై మోదీ మాట్లాడాలన్నారు.లిక్కర్ స్కాంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీ బీజేపీతో కలిసిపోయాయని ఆరోపించారు.
మిగతా వాళ్లను జైల్లో పెడుతున్నారని చెప్పారు.చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కూడా సరిగా లేదన్న నారాయణ ఆయన దేశం వదిలి పారిపోయే వ్యక్తి కాదని తెలిపారు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశం విడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.







