బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో రతిక ( Rathika ) ఒక్కరు.బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో ఉన్నది నాలుగు వారాలే అయినప్పటికీ ఈమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే బాగుంటుంది అన్న ధోరణిలో ప్రేక్షకులు ఉన్నారు.
అలా ఈమె ఆట తీరుతో అందరికీ విసుగు తెప్పించిందని చెప్పాలి.ఇలా రతిక ఎలిమినేషన్ తో ప్రేక్షకులు కూడా పండగ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఒక నెటిజన్ మాత్రం యంగ్ హీరో కిరణ్ అబ్బవరానికి ఈమె లాంటి భార్య రావాలి అంటూ కోరుకోవడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమా( Rules Ranjann ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసింది.అక్టోబర్ ఆరవ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన సరదాగా అభిమానులతో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రూల్స్ రంజాన్ సినిమా హిట్ అయిన తర్వాత నీకు రతిక లాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశారు.ఇలా నేటిజన్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి కిరణ్ అబ్బవరం ఈ ప్రశ్నకు రిప్లై ఇస్తూ.ఎందుకమ్మా నామీద అంత పగ.పెళ్లయితే చేసుకుందాం కానీ ఎలాంటి అమ్మాయి భార్యగా వస్తుందో చూద్దాం అంటూ రిప్లై ఇచ్చారు.మరొక నెటిజన్ హీరోలా ఉన్నావ్ అన్న అంటూ కామెంట్ చేయగా హీరోలా లేకపోయినా మీలో ఒకడిగా ఉంటే చాలు అంటూ ఈ సందర్భంగా ఈయన రిప్లై ఇచ్చారు.
ఏది ఏమైనా నెటిజన్( Netizen ) మాత్రం తనకు రతిక లాంటి భార్య రావాలని కోరుకోవడంతో కిరణ్ అభవరం కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తోంది.







