మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు.ఎన్నికల ప్రచారానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో.

ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలలో రోడ్ షోలలో పాల్గొంటున్నారు.తాజాగా గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో.

ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదని వ్యాఖ్యానించారు.తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడే ఇలాంటి ఎమ్మెల్యేను ఇక్కడ ఇప్పటివరకు ఎన్నడూ చూడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

కందుకూరులో మెడికల్ కళాశాల రావడానికి ప్రధాన కారణం సబితా ఇంద్రారెడ్డినే.ఆమె పట్టుబట్టి మరి నియోజకవర్గానికి కాలేజీ తెప్పించుకున్నారని అన్నారు.

అదేవిధంగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి రాబోతోంది అని స్పష్టం చేశారు.స్థానికంగా ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.పారామెడికల్ అదే విధంగా నర్సింగ్ కాలేజీలో కూడా వస్తాయని కందుకూరు మంచి హబ్ గా రానున్న రోజుల్లో మారబోతుందని స్పష్టం చేశారు.

మెట్రో రైల్ కందుకూరు దాక రావాలని క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఆమె పోరాటం చేశారు.తుక్కుగూడ ప్రాంతంలో 52 పరిశ్రమలు రావడం జరిగాయి.అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ సమీపంలోనే ఉంది.

ఫ్యాక్స్ కానీ ఇండస్ట్రీ వచ్చింది.దీంతో లక్ష మంది పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయి.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
మొదలైన నామినేటెడ్ పదవుల హడావుడి ? ఎవరికి ఏ పదవి దక్కేనో ? 

చైనాలో కొన్ని పెద్ద కంపెనీలు సైతం ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.స్థలం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అంటూ సీఎం కేసీఆర్ సంచలన స్పీచ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు