దళిత బంధు పథకం పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్..!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేవనెత్తిన అనేక అనుమానాలకు వివరణ ఇస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.

దళిత బంధు పథక రూపంలో ఇచ్చిన డబ్బులతో దళితులు ఎవరికి నచ్చిన వచ్చిన పని చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు.దళితబంధు పథకం రూపంలో లబ్ధిదారులు ఆర్థికసాయాన్ని ఎక్కడైనా, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని, ప్రభుత్వం దీన్ని మానిటరింగ్ చేస్తుందని స్పష్టం చేశారు.

మహమ్మారి కరోనా రాకపోయి ఉండి ఉంటే ఏడాది క్రితమే దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అనుకున్నట్లు తెలిపారు.మహమ్మారి కరోనా వల్ల లక్ష కోట్లు నష్టం వచ్చినట్లుస్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు ఈ పథకం ద్వారా అనేక మేలు జరుగుతాయని పేర్కొన్నారు.కొన్ని మండలాల్లో దళిత బంధు పథకం ఏ విధంగా అమలు అవుతుంది తానే స్వయంగా పర్యవేక్షించిన కూడా కెసిఆర్ సభలో చెప్పుకొచ్చారు.

Advertisement
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు