బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రగతిభవన్ ను చేరుకున్నారు.
ఈడీ విచారణ అంశాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలతో పాటు రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.







