తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రుణమాఫీ చేయాలి - బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల బిజెపి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్టంలో రైతుల పంట రుణాలను మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు హామీ ఇచ్చి రెండవసారి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచిపోతున్న రైతుల పంట రుణాలు మాఫీ చేయకపోవడంతో నమ్మిన రైతుల పంట ఋణం ఈ నాలుగేళ్లులో అప్పు రెట్టింపు 2 లక్షలు అయిందన్నారు.ఇప్పుడు రైతులు ఎం చేయాలో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నారని,బ్యాంకు అధికారులురైతులు తీసుకున్న అసలు వడ్డీ కలిపి

 Telangana State Government Should Waive Off Farmers Loans Bjp Protest Details, T-TeluguStop.com
Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

రెండు కట్టాల్సిందేనని నోటీసులు జారీ చేస్తున్నారని అన్నారు.తక్షణమే తెలంగాణా రాష్ట్రము లోని రైతుల పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలనీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కెసిఆర్ ని ఇల్లంతకుంట బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.అనంతరం తహాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతిరెడ్డి, ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు, బీజేపీ నాయకులు రొండ్ల మధుసూదన్ రెడ్డి,తిప్పారపు.

శ్రావణ్,రంజిత్, బండారి రాజు, దేశెట్టి శ్రీనివాస్, మామిడి హరీష్, పున్ని సంపత్, పున్ని రాజు, కృష్ణ, శ్రీనివాస్, తిరుపతి, మహేందర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube