తెలుగు రాష్ట్రలో రామ్ గోపాల్ వర్మ పేరు, ఆయన చేసే కామెంట్ల గురించి బయట పడితే చాలు అది క్షణాల్లో వైరల్ గా మారాల్సిందే.ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన స్టైలే వేరు.
ఆయన చెప్పిందే సత్యం అంటాడు.ఆయన చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు.
అలా రామ్ గోపాల్ వర్మ ప్రతి ఒక్క విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తాడు.
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరోలను స్టార్ లుగా మార్చాడు.అంతేకాకుండా ఎంతోమంది నటీనటులకు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా వరకు మంచి సక్సెస్ అయ్యాయి.
కానీ ఈ మధ్య వర్మ స్టైల్ మొత్తం మారిపోయింది.
తనలోనే కాదు సినిమా విషయంలో కూడా వర్మ మొత్తం స్టైల్ మారుస్తూ బాగా కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నాడు.ఈ మధ్య మొత్తం కొత్త నటీనటులతో కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అంతే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాలను కూడా తన కథలోని చేర్చుకొని బాగా వైరల్ గా మారుస్తుంటాడు.

ఇక రాజకీయ నాయకులను కూడా బాగా దృష్టిలో పెట్టుకొని వాళ్ల నేపథ్యంలో కూడా సినిమాలను తెరకెక్కిస్తాడు.వర్మ దర్శకుడిగా కంటే సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల వల్ల మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.ఆయన చేసే పోస్టులు మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తాయి.
ఒక్కోసారి వివాదాలను కూడా సృష్టిస్తాయి.
కానీ వర్మ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోడు.
తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు.ఇక సెలబ్రిటీలతో దిగిన ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వర్మ తనను ఇంటర్వ్యూ చేసే అమ్మాయిలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ నోటిమీద వేలేసుకునేలా చేస్తాడు.అంతేకాకుండా అమ్మాయిలను ఎక్కడపడితే అక్కడ పట్టుకొని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

ఈ వయసులో కూడా ఆయన అమ్మాయిలతో అలా ఎంజాయ్ చేస్తూ ఉండటానికి చూసి కుర్రాళ్ళు అస్సలు తట్టుకోలేక పోతారు.ప్రతిసారి ఆయన ఎంజాయ్ ని చూసి కుళ్ళు కుంటారు.ఆ మధ్యనే అషు రెడ్డి కాళ్లు నాకి అందరి దృష్టిలో పడ్డాడు.అమ్మాయిలతో ముద్దులు, హగ్ లు అంటూ బాగా రెచ్చిపోతూ కనిపిస్తూ ఉంటాడు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో పంచుకున్నాడు.అందులో ఒక అమ్మాయి చేతిని పట్టుకొని ముద్దడుతూ కనిపించగా మరో చేతికి మల్లెపూలు చుట్టుకొని ఆ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు.అయితే అందులో అమ్మాయి ఫేస్ కనిపించకుండా కవర్ చేశాడు.ఇక ఈ ఫోటో చూసి కుర్రాళ్లంతా కుళ్ళు కుంటున్నారు.మీ లైఫ్ మామూలుగా లేదు కదా అంటూ.ముసలోడివైనా కూడా ప్రతిరోజు పండగ చేసుకుంటున్నావు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరి కొంతమంది ఆ అమ్మాయి ఎవరు అని బాగా ఆరా తీస్తున్నారు.కొందరు అషు రెడ్డి అంటూ మరికొందరు అరియానా అంటూ కామెంట్లు చేస్తున్నారు.కొందరైతే గద్వాల్ విజయ అంటూ ఆమెను టాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు.ఆమధ్య కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి విషయంలో వర్మ బాగా ఫైట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో గద్వాల్ విజయ చేసిన కామెంట్లకు ఈయన తిరిగి ఆమెకు బాగా కౌంటర్లు వేస్తూ కనిపించాడు.







