కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్( CM Jagan ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన నాలుగో విడత నిధులను విడుదల చేశారు.
ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు విద్యాదీవెన పథకం కింద సుమారు 26 లక్షల 98 వేల 728 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది.ఇందుకోసం ఇప్పటివరకు వైసీపీ( YCP ) ప్రభుత్వ రూ.11 వేల 901 కోట్ల నిధులను విడుదల చేసింది.

కాగా 2023 త్రైమాసానికి 9,44,66 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ అన్నారు.ఈ విద్యాదీవెన( Jagananna Vidya Deevena ) పథకం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.గత 57 నెలలుగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.







