చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

ముందుగా అమూల్ మిల్క్ డెయిరీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.రూ.385 కోట్లతో అమూల్ మెగా డైయిరీ ప్లాంట్ నిర్మాణం జరగనుంది.తొమ్మిది నెలల్లోగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

అనంతరం ప్రశాంత్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.తరువాత సీఎంసీ వద్ద 300 పడకల ఆస్పత్రికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

Advertisement
దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు