చెల్లిళ్లే శత్రువులు :  జగన్ కు మంట పుట్టిస్తున్నారే 

ఒకపక్క టిడిపి, జనసేన, బిజెపి కూటమి వైసిపి ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన( CM Jagan ) విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.

గత ఐదేళ్ల జగన్ పాలనపై ఎన్నో విమర్శలు చేస్తూ, జనాల్లో జగన్ గ్రాఫ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.

కచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతూ విస్తృతంగా జనాల్లోకి వెళుతున్నారు.ఒకపక్క ఈ మూడు పార్టీల నేతల విమర్శలు కొనసాగుతూ ఉండగానే, మరోవైపు  తన సొంత చెల్లి షర్మిల,( Sharmila ) చిన్నాన్న కూతురు సునీత ఇద్దరు జగన్ ను టార్గెట్ చేసుకుని న్యాయ యాత్ర పేరుతో రోడ్డు షోలు నిర్వహిస్తూ.

బహిరంగ సభల్లో పాల్గొంటూ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు .ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల తన అన్న పై చేస్తున్న విమర్శలు వైస్  అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి.

Cm Jagan Facing Troubles With Ys Sharmila And Suneetha Details, Jagan, Ys Sharmi

కడప జిల్లాలో పర్యటిస్తున్న సునీత , ( Suneetha ) షర్మిలలు రోడ్ షో లు నిర్వహిస్తూ.బహిరంగ సభలో పాల్గొంటున్నారు.నిన్నటి నుంచి కడప జిల్లాలో ఈ పర్యటన సాగుతోంది.

Advertisement
Cm Jagan Facing Troubles With Ys Sharmila And Suneetha Details, Jagan, Ys Sharmi

వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్యను తమ ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వారు మార్చుకున్నారు.వైయస్ వివేకాను హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటూ జగన్ పై విమర్శలు చేస్తున్నారు.ఈ విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నప్పటికీ జగన్ ను టార్గెట్ చేసుకోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది.2019లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఐదేళ్లపాటు అసలు నిందితులు ఎవరో తేల్చలేకపోయారంటూ జగన్ ప్రభుత్వాన్ని షర్మిల సునీతలు ప్రశ్నిస్తున్నారు.

Cm Jagan Facing Troubles With Ys Sharmila And Suneetha Details, Jagan, Ys Sharmi

దోషులు ఎవరో తెలిసిన వారికి అండగా నిలబడుతూ న్యాయాన్ని అందకుండా చేస్తున్నారని చెబుతున్నారు.తమ అన్న అధికారంలో ఉన్నప్పటికీ న్యాయం చేయలేకపోతున్నారని, నిందితుల పక్షాన నిలబడి తమకు అన్యాయం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వారు ప్రజలను కోరుతున్నారు.

కడప ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్న అవినాష్ రెడ్డిని( Avinash Reddy ) ఓడించి వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ వారు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.న్యాయ యాత్ర పేరుతో వీరు చేస్తున్న ప్రచారం వైసిపికి ఇబ్బందికరంగా మారింది.

వాస్తవంగా ఏపీలో కాంగ్రెస్ కు పెద్దగా ఓటు బ్యాంకు లేదు.ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే ఉంటుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

కాకపోతే సొంత కుటుంబీకులే జగన్ పై హత్య ఆరోపణలు చేస్తూ, జనాల్లోకి వెళుతూ విమర్శలు చేయడం వైసిపికి, జగన్ ఇమేజ్ కు కాస్త డ్యామేజ్ కలిగించే అంశమే.అయితే షర్మిల, సునీత వెనుక చంద్రబాబు ఉన్నారని, ఆయన చెప్పినట్లుగానే వేరు జగన్ ను టార్గెట్ చేసుకున్నారని వైసిపి విమర్శలు చేస్తున్నా, వారు మాత్రం తమ విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు