చీమకుర్తి: వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని ఏపీ సీఎం జగన్ చెప్పారు.ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.2023 సెప్టెంబరులో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ ‘స్లాబ్ సిస్టమ్’ తీసుకొస్తున్నట్లు సీఎం వెల్లడించారు.విద్యుత్ ఛార్జీల్లోనూ రాయితీ ఇచ్చి చిన్న పారిశ్రామికవేత్తలను ఆదుకుంటామని జగన్ చెప్పారు.
తాజా వార్తలు