మనవడితో కూడా చంద్రబాబు ప్రచారం! ఇదెక్కడి చోద్యం  

మనవాడిని కూడా ఎన్నికల పబ్లిసిటీలో వాడుకుంటున్న చంద్రబాబు. .

Chandrababu Political Stratagies Mindblowing-

ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చతురత తెలియనిది కాదు. అతని వ్యూహాల ముందు ఎవరైనా తల దించాల్సిందే, ఓటమిని ఒప్పుకోవాల్సిందే . కుటిల రాజకీయ నీతి తెలిసిన రాజకీయ మేధావి కాబట్టి ఏపీ రాజకీయాలలో ఎవరికి సాధ్యం కాని ఫీట్ ని చంద్రబాబు సొంతం చేసుకున్నాడు..

మనవడితో కూడా చంద్రబాబు ప్రచారం! ఇదెక్కడి చోద్యం-Chandrababu Political Stratagies Mindblowing

ప్రత్యర్ధి పార్టీని దెబ్బ కొట్టడానికి అన్ని రకాల వ్యూహాలని చంద్రబాబు ప్రయోగిస్తారు. తన చేతిలో ఉన్న మీడియాని అడ్డుపెట్టుకొని చివరికి బెదిరింపులకి కూడా పాల్పడతాడు. అదే సమయంలో ప్రజల మధ్యకి వచ్చి సానుభూతి మాటలతో, ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.

ఇన్ని విధాలుగా రాజకీయ క్రీడలు ఆడుతాడని చంద్రబాబు గురించి ఏపీ ప్రజలందరికీ తెలుసు కాని, అనుభవం అంటూ అతనికి మళ్ళీ మళ్ళీ పట్టం కడుతూ ఉంటారు. అయితే ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు వరకు ఐదేళ్ళ ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలలో తన బ్రాండ్ ఇమేజ్ ని దారుణంగా కోల్పోయిన బాబుకి ఈ సారి దారుణ పరాభవం తప్పదని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ కి మూడు నెలల ముందు సంక్షేమ పథకాలు అంటూ ప్రజల మీదకి రకరకాల పేర్లు పెట్టి డబ్బులు విసిరారు.

ఈ ధన ప్రవాహం మళ్ళీ చంద్రబాబుకి అనుకూలంగా మారి, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చంద్రన్న మళ్ళీ కావాలి అనే విధంగా వచ్చేసారు. ఇక ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, కేసీఆర్ ఆంధ్రులని అవమానిస్తున్నారు అంటూ కొత్త పల్లవి పట్టుకొని లబ్ది పొందే ప్రయత్నం మొదలెట్టారు. అలాగే కేంద్రంలో బీజేపీ ఏపీ మీద కుట్రలు చేస్తుందని కొత్త పలుకు కూడా అందుకున్నారు. అలాగే తాజాగా తన ఎన్నికల ప్రచారంలోకి మనవడు దేవాన్ష్ ని తీసుకొచ్చి, తాను ప్రజల కోసం ఎంతగా కష్టపడుతున్నానో తన మనవడికి కూడా తెలియాలని తీసుకొచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు.

మొత్తానికి ఈ చంద్రబాబు రాజకీయాలకి ఏపీ ప్రజలు ఎంత వరకు కనెక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.