పొత్తులపై బాబు ఇలా డిసైడ్ అయ్యారా ? పూర్తిగా మారిపోయిన చంద్రన్న

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) సరికొత్త పంథాలో వెళ్తున్నారు.గతంలో మాదిరిగా ఒంటెద్దు పోకడలకు వెళ్లకుండా , అందరిని సమన్వయం చేసుకుంటూ పార్టీని సుదీర్ఘకాలం అధికారంలో ఉండేలా అనేక వ్యూహ రచనలు చేస్తున్నారు.

2014, 2024 ఎన్నికల్లో జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి రావడంతో,  సుదీర్ఘకాలం ఆ పార్టీలతో పొత్తు కొనసాగిస్తూ , పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండేలా వ్యవహరచన చేస్తున్నారు .అందుకే గతంలో ఎప్పుడు లేనంతగా జనసేన , బిజెపి లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.పదవులు విషయంలో టిడిపి నేతలను త్యాగాలు చేయించి మరి జనసేన ,( Janasena ) బిజెపి లకు ప్రాధాన్యం ఇస్తున్నారు .భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో ఆ రెండు పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ, మిత్రపక్ష పార్టీలకు ప్రాధాన్యాన్ని కల్పిస్తూ,  వారి మద్దతు ఎప్పటికీ ఉండేలా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.ఏ పార్టీతోనైనా , ఎవరితోనైనా అవసరం తీరాక వదిలించుకుంటారనే విమర్శలు చంద్రబాబుపై ఉన్నాయి.

అయితే ఇప్పుడు అటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడంతో ఎదురైన పరాభవం మరెప్పటికీ ఎదురుకాకుండా సుదీర్ఘకాలం జనసేన,  బీజేపీతో( BJP ) పొత్తు కొనసాగించాలని భావిస్తున్నారు.  సీనియర్ నేతలను సైతం పక్కనపెట్టి మిత్రపక్షాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.ముఖ్యంగా ఏపీలో కమ్మ , కాపు సామాజిక వర్గం కాంబినేషన్ హిట్ అయిందని,  అందుకే కాపు సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

Advertisement

ఒకవైపు ప్రత్యర్డి  పార్టీగా ఉన్న వైసీపీని( YCP ) మరింత బలహీనం చేస్తూనే మిత్ర పక్షాలను కలుపుతూ అన్ని విషయాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో పాటు,  ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు తేల్చి చెప్పారట.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితోనూ పదవులు విషయంలో ఎటువంటి పేజీలకు వెళ్లకుండా ఏపీ అభివృద్దే లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దీంతో పాటు పోలవరం , అమరావతి ప్రాజెక్టులను ఈ ఐదేళ్లలో పూర్తి చేసి తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తన చిత్త శుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఆ హామీలు అమలు చేసే విషయంలో కేంద్రం సహకారం తప్పనిసరి కావడంతో,  ఆ పార్టీకి ఏపీలో వీలైనంత ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తూనే , కేంద్ర బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకుని, వీలైనంత ఎక్కువ నిధులు ఏపీకి వచ్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు