సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర

రేషన్ షాపుల ద్వారా అమ్మహస్తం పథకం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 9 సరుకులు పంపిణీ చేస్తే బంగారు తెలంగాణ పాలకులు కేవలం బియ్యం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వ హామీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు.

 Clp Leader Bhatti Padayatra , Clp Leader Bhatti Vikramarka , Clp Leader , Trs, D-TeluguStop.com

సంపద పెరిగిన రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించిన టిఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను ఎత్తివేసిందన్నారు.ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంత మందికి పంపిణీ చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కూలినాలి పనులతో కాయకష్టం చేసి పిజి, ఇంజనీరింగ్ చదివించిన పిల్లలకు ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాలు రాకపోవడంతో… ఉన్నత చదువులు చదివిన పిల్లలు సుతారి పనులకు వెళుతుడటం చూసి తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.300 కిలో మీటర్ల దూరం నడిచి ఈ దేశినేని పాలెం వచ్చా.

రాత్రి పూట ఆలస్యమైనా కూడా గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికి మరలా ఈరోజు ఉదయం మరలా నాతో కలిసి నడిచిన దేశినేని పాలెం ప్రజలకు ధన్యవాదాలు.ఈ గ్రామంలో ఎంపీటీసీ గా గెలిచిన తులశ్యమ్మ గారు చెప్పినట్లే ఏ ప్రజా ప్రతినిధి కూడా గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చలేని పరిస్థితి కలిపించిది ఈ ప్రభుత్వం.

ఈ ప్రాంతం అంత కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అలాంటి ఈ ప్రాంతం లో వరి వేయక ఏమి వేస్తారు.మన భూమిలో ఏమి పంట పండుతోంది మనకే తెలుస్తుంది…అలాంటిది ఎక్కడో కూర్చున్న ముఖ్యమంత్రికి ఏమి తెలుసు, రాజరిక వ్యవస్థలో కూడా మార్కెట్లు ఉండేవి కానీ ఇప్పుడు వరి వేస్తే ఉరి అనడం సరైంది కాదు రైతులు వేసినా పంటలు ప్రభుత్వాలు కొనడం ప్రభుత్వాల బాధ్యత,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కొన్నాయి ఎండలు మండుతున్నాయి అయినా ఈ ప్రజల కోసం ఎవరో ఒకరు పోరాటం చేయాలి అందుకే రాష్ట్ర ప్రజల అందరి తరుపున నేను పోరాటం చేస్తున్నా.

ఒక్క అసెంబ్లీ లో పోరాడితే సరిపొకనే ఈ పాదయాత్రతో ప్రజల మధ్యకు వచ్చినా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube