అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రభాస్.. మధ్యప్రదేశ్ సీఎం షాకింగ్ కామెంట్స్ వైరల్!

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల స్థాయి అంచనాలకు అందని స్థాయిలో పెరిగింది.టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాల ద్వారా దేశవిదేశాల్లో సత్తా చాటుతున్నారు.

 Madhyapradesh Cm Shocking Comments Viral In Social Media Details Here Madhyaprad-TeluguStop.com

బాహుబలి సిరీస్ సినిమాలు, కేజీఎఫ్1, కేజీఎఫ్2, పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు సౌత్ సినిమాల ఖ్యాతిని అంతకంతకూ పెంచుతున్నాయి.అయితే తాజాగా మధ్యప్రదేశ్ సీఎం తెలుగు సినిమాల గురించి, తెలుగు హీరోల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు ప్రజలు మధ్యప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు.తన రాష్ట్ర ప్రజలతో తెలుగువాళ్లు బాగా కలిసిపోయారని ఆయన అన్నారు.

తెలుగు సంగమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాలను వెల్లడించారు.మనమంతా గొప్ప దేశమైన భారత్ కు చెందిన వాళ్లమని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Bahubali, Jntr, Kgf, Prabhas, Rajamouli, Ramcharan, Shivrajsingh, Sr Ntr,

భారతీయ సినిమాలలో టాలీవుడ్ కు ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు.టాలీవుడ్ ప్రొడ్యూసర్లు దేశ ప్రజలందరికీ సుపరిచితులే అని ఆయన కామెంట్లు చేశారు.బాలీవుడ్ కంటే టాలీవుడ్ పెద్దదని దేశ ప్రజలకు బాహుబలి లాంటి సినిమాలను ఇస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.తెలుగు ప్రజలను ప్రపంచం గుర్తించే విధంగా సీనియర్ ఎన్టీఆర్ కృషి చేశారని ఆయన అన్నారు.

స్టార్ హీరో ప్రభాస్ ప్రపంచం తెలుగువాళ్లను గుర్తించేలా చేస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Bahubali, Jntr, Kgf, Prabhas, Rajamouli, Ramcharan, Shivrajsingh, Sr Ntr,

టాలీవుడ్ ఇండస్ట్రీ భవిష్యత్తుకు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.వేరే రాష్ట్రానికి చెందిన సీఎం తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించే విధంగా కామెంట్లు చేయడం గమనార్హం.దర్శకధీరుడు రాజమౌళి వల్లే తెలుగు సినిమాలకు ఈ స్థాయిలో గుర్తింపు దక్కిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

భవిష్యత్తులో ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాల కోసం, మన దేశ భాషల సినిమాల కోసం ఎదురుచూసే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube