ప్రపంచంలో ఓ కొత్త విషయానికి ఊపిరిపోయడానికి శాస్త్రవేత్తలు పడే తాపత్రయం, శ్రమ ఎంత వర్ణించినా తక్కువే.నిరంతరం వారి ధ్యాస పరిశోధనల మీదే ఉంటుందనడానికి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే క్లోనింగ్ ప్రక్రియలో ఒక జంతువును తయారుచేయడంలో శాస్త్రవేత్తలు ఘనవిజయం సాధించారు.
మొదటి సారిగా క్లోన్ చేసిన గొర్రె 1996 జూలై 5 న స్కాట్లాండ్‌లోని రోస్లిన్ ఇన్‌స్టిట్యూట్‌లో జన్మించినప్పటికీ, ఏడు నెలల అనంతరం 1997 లో సరిగ్గా ఇదే రోజున క్లోనింగ్ ద్వారా గొర్రెకు జన్మనిచ్చినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
అయితే ఈ క్లోనింగ్ పక్రియలో 227 సార్లు విఫలమైన శాస్త్రవేత్తలు చివరకు క్లోన్ గొర్రె జన్మకు కారణం అయ్యారట.

కాగా గొర్రెకు అమెరికన్ గాయని, నటి డాలీ పార్టన్ పేరు పెట్టారు.డాలీ పార్టన్ చాలా బలంగా ఉండటం వల్ల దీని క్లోనింగ్‌తో పుట్టిన గొర్రెకు డాలీ అని పేరు పెట్టారట.ఇక ఇదివరకు క్లోనింగ్‌తో పుట్టిన డాలీ 2001 నాటికి అనారోగ్యానికి గురవడంతో 2003 ఫిబ్రవరి 14 న అనాయాస మరణం జరిగేలా మందు ఇవ్వడంతో అది చనిపోయింది.
డాలీ జన్మించినప్పుడు 11–12 సంవత్సరాలు జీవిస్తుందని పరిశోధకులు ఊహించారు, అయితే, డాలీ ఆరున్నర సంవత్సరాల్లోనే చనిపోయింది.డాలీ మరణానంతరం పోస్టుమార్టం చేసినప్పుడు దానికి గొర్రెలకు తరుచుగా వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు తెలిందట.
ఇప్పుడు అలాంటి డాలీనే క్లోనింగ్ ద్వార మళ్లీ పుట్టించడం అద్భుతం అంటున్నారు.