ప్రముఖ కంపెనీ నుండి ఖాతాదారుల వివరాలు లీక్..?!

రోజు రోజుకు టెక్నాలజీ ఎలా మారుతుందో నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాల్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటుంన్నారు.

 Client Details Leaked From Leading Company , Samsung,data, Leaked, Technology N-TeluguStop.com

కొంత మంది మూడో కంటికి కనిపించకుండా దాచుకునే మన డేటాను కొంతమంది దోచేస్తున్నారు.ప్రస్తుతం ఏది కావాలన్నా ఆన్‌లైన్‌ లో జరుగుతుంది.

అంతేకాకుండా మనకు ఎంతో ముఖ్యమైన విషయాన్ని కూడా మన ఫోన్‌లో భద్రంగా దాచుకుంటాం.కానీ వీటి వెనుక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.

టెక్నాలజీని ఉపయోగించుకొని మన సమచారాన్ని హ్యాక్ చేస్తున్నారు కేటుగాళ్లు.

కాగా.

, అనధికారిక థర్డ్ పార్టీ శాంసంగ్ కంపెనీ కొన్ని అమెరికా సిస్టంల నుంచి డేటా లీక్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఆగస్టు 4 పేర్కొంది.

లీకై సిస్టంలను సురక్షితంగా ఉంచేందుకు కంపెనీ తగు చర్యలను తీసుకుంటున్నామని, వినియోగదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.దీనిపై శాంసంగ్ ఎఫ్‌క్యూ పేజీ తెలిపింది.ఈ డేటా ఉల్లంఘన యూజర్ల ఫోన్ నంబర్‌లు లేదా క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లను ప్రభావితం చేయలేదని, జూలైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని కొంతమంది యూజర్ల పేరు కాంటాక్టులు, జనాభ డేటా, పుట్టిన తేదీ, ప్రొడక్టు నమోదు డేటా వంటివి చోరికి గురైనట్లు తెలిపింది.

ఈ జాగ్రత్తలు తప్పని సరి.

జూలైలో డేటా చోరికి గురైనట్లు గుర్తించిన కంపెనీ వినియోగదారులకు కీలక సూచనలు చేసింది.అకౌంట్లను మరింత సేఫ్‌గా ఉంచుకునేందుకు, ప్రయత్నాలు చేయాలంది.

ఎవరూ అనుమానాస్పద లింక్‌లు ఓపెన్ చేయకూడదని, వ్యక్తిగత డేటాపై ప్రైవసీ స్ట్రాంగ్‌ గా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.శాంసంగ్ కస్టమర్ల భద్రత, వారి ప్రైవసీ కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని శాంసంగ్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube