టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో సురేఖావాణి ఒకరు.ప్రస్తుతం సురేఖావాణి సినిమాలలో ఎక్కువగా నటించకపోయినా ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.
సురేఖావాణి సినిమాల ద్వారా ఇప్పటివరకు ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను కూడబెట్టారని సమాచారం అందుతోంది.సురేఖావాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
సురేఖావాణి తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన, పార్టీ చేసుకున్న కొన్ని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా ఆ వీడియోలలో కొన్ని వీడియోలు వివాదాస్పదం అవుతున్నాయి.అయితే నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా సురేఖావాణి, సుప్రీత ముందడుగులు వేస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియా ద్వారా సురేఖావాణి, సుప్రీత బాగానే సంపాదిస్తున్నారని సమాచారం అందుతోంది.
శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు సురేఖావాణికి నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.
సురేఖావాణి మళ్లీ సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.మరి సురేఖావాణి కొత్త సినిమా ఆఫర్లతో బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.
చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో పోల్చి చూస్తే సురేఖావాణి రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తమేనని సమాచారం.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సురేఖావాణి రేంజ్ మారుతుందని చెప్పవచ్చు.కెరీర్ విషయంలో సురేఖావాణి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.సురేఖావాణిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
కొత్త నటీనటుల ఎంట్రీ వల్లే సురేఖావాణికి సినిమా ఆఫర్లు అయితే తగ్గుతున్నాయని మరి కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.సరైన ప్రాజెక్ట్, రోల్ దొరికితే సురేఖావాణి మళ్లీ సినిమాలలో బిజీ అవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
సురేఖావాణి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటి అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.







