స్నేహితుల మద్య పెరుగుతున్న అంతరం

మహారాష్ట్రలో పరిస్థితి ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.బీజేపీ మరియు శివసేనలు అధికారం విషయంలో అస్సలు వెనక్కు తగ్గడం లేదు.

బీజేపీ ముఖ్యమంత్రి పదవిని సగం రోజులు ఇచ్చేందుకు ఒప్పుకోక పోవడంతో శివసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.తమ మద్దతు కీలకం అయినప్పుడు తమకు ముఖ్యమంత్రి పదవి కనీసం సగం రోజులు అయినా ఇవ్వడం రాజకీయంగా అది ధర్మం అంటూ శివసేన నాయకులు మొదటి నుండి చెబుతున్నారు.

కాని బీజేపీ మాత్రం మా సీట్లలో సగం సీట్లు మీకు లేవు.అలాంటిది మీకు ఎందుకు సీఎం పీఠం అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల సమయంలో శివసేన మరియు బీజేపీలు కలిసి మెలిసి ప్రచారం చేశాయి.ఒక పార్టీ నాయకుడు రెండు పార్టీల జెండాలు మెడలో వేసుకుని మరీ తిరిగారు.

Advertisement

కాని ఇప్పుడు పరిస్థితి మారింది.ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

బీజేపీ నాయకులు కొందరు శివసేనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంటే శివసేన పార్టీ నాయకులు అధికారం కోసం ప్రాకులాడుతున్నారు అంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

మొత్తానికి ఈ ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లింది.దాంతో రెండు పార్టీలు కలిసే అవకాశమే కనిపించడం లేదు.

ఈ వివాదం ఇంకాస్త ముదిరితే శివసేన, ఎన్సీపీ మరియు కాంగ్రెస్‌లు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు