జనసేన లో చేరతానంటున్న  థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ? పవన్ రియాక్షన్ ఇదే ?

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వి రాజ్  మొదటి నుంచి జగన్ కు వీరాభిమాని గా ఉంటూ వచ్చారు.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జనసేన,  టిడిపి వంటి పార్టీలపై ఆయన తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.

 Cine-actior-prudviraj-join-in-janasena Pavan Kalyan, Janasena, Pavan, Thirty Yea-TeluguStop.com

  జగన్ కు మరింత దగ్గరయ్యారు.అలాగే జగన్ నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రాధాన్యం పెంచుకున్నారు.

  2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి సత్తా చాటుకోవాలని పృద్వి భావించినా,  జగన్ ఆయనకు సమయం కేటాయించలేదు.అయినా అసంతృప్తి చెందకుండా ఎన్నికల ప్రచారంలో తిరిగారు.

        వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్వీబీసీ ఛానల్ కు చైర్మన్ గా నామినేటెడ్ పోస్టులో జగన్ కూర్చోబెట్టారు.ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనపై కొన్ని,  విమర్శలు రావడంతో ఆ పదవి నుంచి తప్పించారు.

ఇక అప్పటి నుంచి వైసిపి అగ్రనేతలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఆయన వైసీపీ పై విమర్శలు చేస్తూ జనసేనకు దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  పదేపదే పవన్ కళ్యాణ్ ను పొగుడుతున్నారు.

  వైసీపీ నేతల అండతో తాను నోటికొచ్చినట్టు మాట్లాడని,  తప్పయిపోయింది అంటూ పృద్వి పవన్ నాగబాబు వంటి వారిని వేడుకోవడం వంటి వ్యవహారాలు ఈ మధ్యకాలంలో జరిగాయి.ఇది ఇలా ఉంటే … ఆయన త్వరలోనే తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.   

Telugu Ap Cm Jagan, Cineactior, Janasena, Janasenani, Pavan, Pavan Kalyan, Indre

  ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెప్పగా , తప్పకుండా చేర్చుకుంటామని ప్రస్తుతానికి సినిమాలు చేసుకోవాలని సూచించినట్లుగా పేర్కొన్నారు.ఆ భరోసాతో తనకు కొత్త ఉత్సాహం వచ్చిందని,  ఇకపై ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని ఆయన ప్రకటించారు.తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని,  అయిపోయింది ఏదో అయిపోయిందని సినిమాల్లో ట్రై చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని వారు తనకు సూచించారని పృథ్వి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube