కచ్చా బాదం పేరు వింటే, పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ‘భూబన్ బద్యాకర్’ వెంటనే స్ఫురణకు వస్తాడు.అతడు ఓ సాధారణ పల్లీల వ్యాపారి.
సైకిల్ పై పల్లీలు అమ్ముతూ జీవనయానాన్ని కొసనసాగిస్తున్న అతగాడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది.ఓ రోజు అనుకోకుండా తన చేతిలో వున్న డొక్కు ఫోన్ పట్టుకొని సరదాగా ‘కచ్చా బాదం’ అంటూ ఓ పాట పాడాడు.
ఇక అంతే.ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయాడు.
సామన్యునుల నుండి సెలబ్రెటీల వరకూ ఆ పాటను ఆస్వాదించారు.ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కచ్చా బాదం క్రేజ్ తగ్గనేలేదు.
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది ఈ పాట.
ఈ క్రమంలో బద్యాకర్ సెలిబ్రిటీ అయిపోయాడు.కొన్ని స్టూడియోలు అతగాడిని పెట్టుకొని కొన్ని ఆల్బమ్స్ లలో పాటలు పాడించుకున్నాయి.అంతటితో ఆగకుండా కొన్ని మీడియా లైవ్ షోలలో అతని చేత “కచా బాదం” పాటని కూడా పాడించుకుంటున్నారు.
ఈ క్రమంలో అనేకమంది అతనికి అభిమానులుగా మారారు.ముఖ్యంగా నార్త్ జనాలు అతగాడిని అమితంగా ఇష్టపడుతున్నారు.
ఇక తాజాగా భూబన్ బద్యాకర్… ఢిల్లీలో ఉన్న తన అభిమాని నుండి సరికొత్త Apple iPhone 13ని బహుమతిగా అందుకున్నాడు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భూబన్ బద్యాకర్ పాల్గొన్నారు.కాగా ఈ కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.కార్యక్రమం అనంతరం ఓ వ్యక్తి సార్ నేను మీ అభిమానిని అంటూ ఐఫోన్ 13ని గిఫ్ట్ గా ఇచ్చాడు.తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భుబన్ మాట్లాడుతూ.“ఈ ఐఫోన్ అందుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.ముఖ్యంగా ఓ అభిమాని చేతితో అందుకోవడం మరింత ఆనందాన్ని కలిగించింది.” అని అన్నాడు.ఇకపోతే Apple iPhone 13 ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్ లలో కొన్ని ఉత్తమ కెమెరాలను అందిస్తుంది.